Thursday, November 21, 2024

బంగ్లాదేశ్ 50వ విజ‌యోత్స‌వ వేడుక‌లు : భార‌త రాష్ట్ర‌ప‌తికి ఘ‌న స్వాగ‌తం ప‌లికిన సైన్యం

బంగ్లాదేశ్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాలు జరుపుకుంటోన్న నేప‌థ్యంలో కోవింద్ ఆ దేశంలో ప‌ర్య‌టిస్తున్నారు భార‌త రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్. మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం బంగ్లాదేశ్ రాజ‌ధాని ఢాకాకి చేరుకున్నారు రామ్ నాథ్ కోవింద్. ఈ మేర‌కు అక్క‌డి సైన్యం రామ్ నాథ్ కి ఘ‌న‌స్వాగ‌తాన్ని ప‌లికింది. రాష్ట్ర‌ప‌తి సైనికుల గౌర‌వ వంద‌నాన్ని స్వీక‌రించారు. ఢాకాలో నిర్వహిస్తున్న బంగ్లాదేశ్ 50వ విజయోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొన‌నున్నారు. భారత్, బంగ్లాదేశ్ల మధ్య 50 ఏళ్లుగా దౌత్య సంబంధాలు కొన‌సాగుతున్నాయి. 1971 డిసెంబరు 16న పాకిస్థాన్ సైన్యంపై భారత్, బంగ్లాదేశ్ బలగాలు విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. కరోనా వ్యాప్తి మొదలైన అనంత‌రం భాత‌ర‌ రాష్ట్రపతి చేపడుతోన్న తొలి విదేశీ పర్యటన ఇదే. ఈ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ అధ్యక్షుడితో ద్వైపాక్షిక సమావేశంలో కోవింద్ పాల్గొంటారు. అనంత‌రం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్తోనూ ఆయ‌న‌ భేటీ అవుతారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital
Advertisement

తాజా వార్తలు

Advertisement