Sunday, November 10, 2024

విడాకుల విష‌యంలో నేను, స‌మంత హ్యాపీ – నాగ‌చైత‌న్య స్టేట్ మెంట్


మొద‌టిసారి విడాకుల విష‌యంపై స్పందించాడు హీరో నాగ‌చైత‌న్య‌. బంగార్రాజు సినిమా ప్ర‌మోష‌న్స్ లో పాల్గొంటున్న చైత‌న్య‌కి మీడియా నుంచి వ్య‌క్తిగ‌త ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. ఈ మేర‌కు హీరోయిన్ స‌మంత‌తో విడాకుల గురించి మాట్లాడారు. విడాకుల విష‌యంలో తాను, స‌మంత మాట్లాడుకునే నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్పాడు. ఇద్దరం కలసి తీసుకున్న నిర్ణయం కాబట్టి పెద్దగా డిస్ట్రర్బ్ లేదు. నేను హ్యాపీ.. సమంత కూడా హ్యాపీ అంటూ చైతు డివోర్స్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఫ్యామిలీ అన్నివిధాలుగా తమకు సపోర్ట్ చేసింద‌ని వెల్ల‌డించాడు. విడాకులు మంచిదే అని భావించి విడిపోయాం అన్నారు. ఇప్పుడిప్పుడే చైతు విడాకుల చేదు జ్ఞాపకం నుంచి బయట పడుతున్నాడు. అందుకే మీడియా ముందు తన వ్యక్తిగత అంశాల గురించి కూడా ఓపెన్ అవుతున్నాడు. చైతు, సమంత ఎందుకు విడిపోయారనేది మాత్రం వారి కుటుంబ సభ్యులకు తప్ప మరెవరికి తెలియదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement