Friday, November 22, 2024

వీడియో: కరోనా పరీక్షలు వద్దన్నారని యువకులను చితక్కొట్టిన పోలీసులు

కరోనా నిబంధనల పేరిట ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో కలెక్టర్ ఓ వ్యక్తిని కొట్టగా.. ఇది వివాదాస్పదమై కలెక్టర్ బదిలీ కూడా అయ్యారు. బెంగళూరులో కూడా అలాంటి ఘటనే వెలుగు చూసింది. కాకపోతే ఇక్కడ కరోనా పరీక్షలు చేయించుకోలేదని చావబాదారు. కరోనా పరీక్షలు చేయించుకునేందుకు మొండికేసిన ఇద్దరు యువకులను పోలీస్ సిబ్బంది చితక్కొట్టేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో బృహత్ బెంగళూరు మహానగర్ పాలికె (బీబీఎంపీ) స్పందించింది. ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేస్తూ బీబీఎంపీ కమిషనర్ గౌరవ్ గుప్తా క్షమాపణలు తెలిపారు. దాడిలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

నిందితులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నగర‌త్‌పేటలో జరిగిన ఈ ఘటన విచారకరమని గౌరవ్ గుప్తా ట్వీట్ చేశారు. బలవంతంగా పరీక్షలు చేయడం సరికాదన్నారు. యువకులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, నిందితులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు జరగడానికి వీల్లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement