గణేశ్ నవరాత్రులు ముగిశాయి. తొమ్మిది రోజులు విశిష్ట పూజలందుకున్న గణపయ్య గంగమ్మ ఒడికి చేరారు. అయితే.. చివరి రోజు ఘనంగా శోభాయాత్ర నిర్వహించి నిమజ్జనోత్సవానికి తరలించారు. ఈ సందర్భంగా వినాయకుడి చేతిలో ఉన్న లడ్డూ వేలం విషయంలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటిదాకా హైదరాబాద్ బాలాపూర్ లడ్డూ వేలం అంటేనే యావత్ దేశానికి తెలిసిన విషయం.. అక్కడే ఎక్కువ మొత్తంలో వేలంలో దక్కించుకుంటారన్న విషయం తెలుసు..
కానీ, నిన్న సికింద్రాబాద్ అల్వాల్లో జరిగిన లడ్డూ వేలం మరింత చర్చకు దారితీసింది. ఈ గణపతి లడ్డూని అల్వాల్ శ్రీలక్ష్మీ 44.99 లక్షలకు దక్కించుకున్నారు. ఇక, ఇవ్వాల అల్వాల్ని మించి మరో లడ్డూ ధర పలికింది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ కీర్తి రిచ్మండ్ విల్లాస్లోని గణేశ్ లడ్డూ రికార్డు కొట్టిందనే చెప్పవచ్చు. దీన్ని 60.8 లక్షలకు అక్కడి భక్తులు దక్కించుకున్నారు. ఇప్పటికైతే ఇదే హయ్యెస్ట్ వేలంగా చెబుతున్నారు.