తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సాక్షిగా 80,039 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించి నోటిఫికేషన్ల విషయంలో తాత్సారం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఇంకా 63,425 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇంకెప్పుడు విడుదల చేస్తారని ప్రశ్నించారు. పోలీస్ శాఖలో రిక్రూట్ మెంట్ కు నోటిఫికేషన్ జారీ చేసి నిరుద్యోగ యువతకు ఎంతో మేలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని, మిగతా పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో ప్రకటన చేసి 45 రోజులు అవుతోందని, 16,614 పోలీసు పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్లు విడుదల చేశారని బండి సంజయ్ ఆక్షేపించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement