Saturday, November 23, 2024

కేంద్ర పథకాలకు పేరు మార్చి తెలంగాణలో అమలు చేస్తున్నారు: బండి సంజయ్..

తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాల పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రజాసంగ్రామ యాత్ర 16వ రోజు కొనసాగుతోంది. మెదక్ జిల్లాలో కొనసాగుతోన్న పాదయాత్ర భాగంగా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో ఉన్నవి కేంద్ర ప్రభుత్వ పథకాలేనని, పేరు మార్చి అమలు చేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాల గురించి చర్చకు సిద్ధమా? అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారని, అసలు ప్రభుత్వం ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణ విమోచన దినానికి ప్రభుత్వం అధికారిక హోదా తీసుకురాలేకపోతే.. తామే కేంద్రం నుంచి తీసుకొస్తామని అన్నారు. వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోలేదని, వెంటనే పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తన పాదయాత్రకు ప్రజల నుంచి అమోఘమైన స్పందన వస్తోందని, ఎక్కడికెళ్లినా ఆదరిస్తున్నారని సంజయ్ చెప్పారు. ఈ నెల 17న జరిగే పాదయాత్రలో అమిత్ షా పాల్గొంటారని ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి: “మా” సభ్యులకు ప్రకాష్ రాజ్ స్పెషల్ విందు..

Advertisement

తాజా వార్తలు

Advertisement