Thursday, November 21, 2024

Omicron: దేశంలో ఒమిక్రాన్ టెన్షన్.. ఐదో కేసు నమోదు

భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భయపెడుతున్నాయి. ఇప్పటికే దేశంలో నాలుగు కేసులు నమోదు కాగా.. తాజాగా ఐదో కేసులు బయటపడింది. కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు నమోదవగా.. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలోనూ మరో కేసు వచ్చింది. ఢిల్లీ ఆదివారం కొత్త ఒమిక్రాన్ కేసు నమోదైంది. టాంజానియా నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ వ్యక్తికి ఓమిక్రాన్ వేరియంట్ సోకింది. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది.

టాంజానియా నుంచి వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్ గుర్తించినట్టు ఆ ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. ఒమిక్రాన్ ఉన్నట్టు అనుమానిస్తున్న మరో 16 మందిని ఢిల్లీలోని ఎల్ ఎన్ జేపీ ఆసుపత్రిలో చేర్పించామన్నారు. వారిపై నిఘా పెట్టి.. అందరికీ చికిత్స చేస్తున్నామని వివరించారు.

ఇప్పటికే బెంగళూరులో 2 ఓమిక్రాన్ కేసులు నమోదు కాగా.. గుజరాత్, ముంబైలో ఒక్కో కేసులు వెలుగు చేశాయి. ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎయిర్ పోర్టుల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలను తప్పని సరి చేస్తున్నారు. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయితే, వారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. అయితే, వీరికి ఏ వేరియంట్ సోకందో అని తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిస్తున్నారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement