Friday, November 22, 2024

టెన్త్ పేపర్ లీక్ లో ఏ1గా బండి సంజయ్.. సీపీ రంగనాథ్

టెన్త్ పేపర్ లీక్ లో ఏ1గా బండి సంజయ్ అని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. వరంగల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీ రంగనాథ్ మాట్లాడుతూ… ఏ2గా ప్రశాంత్, ఏ3గా మహేష్, ఏ4 మైనర్ అని, అందుకే వివరాలు వెల్లడించడం లేదన్నారు. ఏ5 గా మోతం శివగణేశ్, ఏ6 గా పోగు సుభాష్, ఏ7గా పోగు శశాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9గా పెరుమాండ్ల శ్రామిక్, ఏ10గా పోతబోయిన వసంత్ అని సీపీ తెలిపారు. బండి సంజయ్ పై 120 (బీ), 420, 447, 505, 4(ఏ), 6R/W, ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్, 66-D ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు సీపీ రంగనాథ్ తెలిపారు. టెన్త్ హిందీ పేపర్ ను ప్రశాంత్ వైరల్ చేశారన్నారు. మొదట ప్రశాంత్ మీడియా గ్రూపుల్లో పేపర్ పెట్టాడని సీపీ తెలిపారు. ఆ తర్వాత బండి సంజయ్ కు ఫార్వర్డ్ చేశాడన్నారు. ప్రశాంత్, మహేష్ చాలా మందికి పేపర్ ను పంపారన్నారు. ఈటల రాజేందర్ తో పాటు ఆయన పీఏలకు పేపర్లు పంపారన్నారు. సోమవారం సాయంత్రం ప్రశాంత్, బండి సంజయ్ ల మధ్య వాట్సప్ చాటింగ్ జరిగిందన్నారు. ప్రశాంత్ తో బండి సంజయ్ వాట్సప్ కాల్ కూడా మాట్లాడారన్నారు.

ఇద్దరి వాట్సప్ చాట్స్ పేపర్ లో వస్తున్నాయన్నారు. వాట్సప్ డేటా కొంత మంది డిలీట్ చేశారన్నారు. వాట్సప్ డేటా, కాల్ డేటా అనాలసిస్ చేయాలన్నారు. మెసేజ్ షేర్ చేసినందుకు కేసు పెట్టలేదన్నారు. కమలాపుర్ నుంచే ఎగ్జామ్ పేపర్లు ఎందుకు లీక్ అవుతున్నాయని ? అంటే.. ప్రశాంత్ నమో టీమ్ లో మెంబర్ గా ఉన్నాడన్నారు. పేపర్ లీక్ పక్కా పథకం ప్రకారమే జరుగుతోందన్నారు. అరెస్ట్ చేయడానికి వారెంట్ అవసరం లేదన్నారు. ఫార్వర్డ్ చేసినందుకు కేసు పెట్టలేదన్నారు. అరెస్టులు అన్నీ సీఆర్పీసీ నోటీసుల ప్రకారమే చేశామన్నారు. లోక్ సభ స్పీకర్ కు దీనిపై సమాచారం అందించామన్నారు. డిలీట్ చేసిన డేటా బయటకు తీసిన తర్వాత చాలా విషయాలు బయటపడతాయన్నారు. పరీక్ష ప్రక్రియను, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నించారన్నారు. చాలా డేటా డిలీట్ చేశారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement