హైదరాబాద్ – బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యాలకు రాష్ట్ర మహిళ కమిషన్ ఇచ్చిన నోటీసును అందుకున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు విచారణకు హాజరయ్యారు. కవితపై తాను తెలంగాణలో వాడుకలో ఉన్న సామెతను మాత్రమే చెప్పానని పేర్కొన్నారు.. తాను చేసిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నట్లు రెండు పేజీల్లో వివరణ ఇచ్చారు. ఈ వివరణను స్వీకరించిన మహిళా కమిషన్ ఇకపై మహిళలపై ఎటువంటి అనుచిత వ్యాఖ్యాలు చేయవద్దని బండి సంజయ్ కు కోరింది.. ఇంతటితో ఈ వ్యవహారాన్ని ముగిస్తున్నట్లు పేర్కొంది.. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, టిఎస్ పి ఎస్ సి పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఐటి మంత్రి కెటిఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.. సిట్టింగ్ జడ్జితో పూర్తి స్థాయి విచారణ జరపాలని కోరారు.. ఈ కేసులో నిందితుడు ప్రవీణ్ బిజెపి కార్యకర్తగా వస్తున్నవార్తలపై స్పందిస్తూ, అతడి బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయకుండా ప్రభుత్వ ఉద్యోగం ఎలా ఇచ్చారంటూ ప్రశ్నించారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement