Saturday, November 23, 2024

బండి అరెస్ట్ పై భ‌గ్గుమ‌న్న బిజెపి శ్రేణులు.. నిర‌స‌న‌లు, ఖండ‌న‌లు, అరెస్ట్ లు

హైద‌రాబాద్ – తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయడంపై ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కారణం చెప్పకుండా తమ నేతను అరెస్ట్‌ చేశారంటూ కార్యకర్తలు మండిపడుతున్నారు. సంజయ్‌ను కరీంనగర్‌లో అరెస్ట్‌ చేసి భువనగిరి జిల్లా బొమ్మల రామారం పోలీస్‌స్టేషన్‌కు తరలించిన నేపథ్యంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు సహా భాజపా శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. దీంతో పోలీస్‌స్టేషన్‌ పరిసరాల్లో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లే ప్రధాన మార్గాన్ని బారికేడ్లతో పోలీసులు మూసివేశారు. భాజపా కార్యకర్తలను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ర‌ఘ‌నంద‌న్ తో స‌హా పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా, పరామర్శించడానికి వచ్చిన వాళ్లను అరెస్ట్ చేయడం ఏంటని, తనను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని రఘునందన్ రావు.. పోలీసులను ప్రశ్నించారు. రఘునందన్ రావుతో పాటు మరికొందరు మహిళా బేజేపీ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ ముందు మరింత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల తీరుపై సీరియస్ అయిన రఘునందన్ రావును పోలీస్ వెహికిల్స్ లోకి బలవంతంగా ఎక్కించుకొని స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో బీజేపీ నాయకుల అక్రమ అరెస్టులను ఖండించారు.


గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. రాష్ట్రంలో దుర్మార్గుల పాలన నడుస్తోందని, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండా అర్థరాత్రి పోలీసులను అరెస్ట్ చేయడం ఏంటని రాష్ట్ర తీరుపై మండి పడ్డారు.

ప్ర‌భుత్వ కుట్రే – డికె, ఈట‌ల‌,కిష‌న్ రెడ్డి,ల‌క్ష్మ‌ణ్

బండి సంజయ్‌ అరెస్ట్‌పై భాజపా ముఖ్యనేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ చెప్పారు. ఒక ఎంపీని కారణం చెప్పకుండా అరెస్ట్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ చెప్పినట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పేపర్‌ లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు, తప్పుదోవ పట్టించేందుకే సంజయ్‌ను అరెస్ట్‌ చేశారన్నారు. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -

రాజ‌కార్ల ప్ర‌భుత్వం – ల‌క్ష్మ‌ణ్

కెసిఆర్ ప్ర‌భుత్వం ర‌జకార్ల ప్ర‌భుత్వాన్నిత‌ల‌పిస్తున్న‌ద‌ని బిజెపి ఎంపి డాక్ట‌ర్ కె ల‌క్ష్మ‌ణ్ మండిప‌డ్డారు.. కెసిఆర్ అక్ర‌మాల‌పై నిల‌దీస్తున్నందునే బండి ని అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు.. వెంట‌నే బండిని విడుద‌ల చేయాల‌ని ఆరోపించారు..

ల‌క్ష‌ల కోట్ల అక్ర‌మ ఆస్తులు సంపాదించిన కెసిఆర్ కుటుంబం ఆ ఆరోప‌ణ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేందుకే బండి అరెస్ట్ డ్రామ అడింద‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు.. ప్ర‌జ‌ల నుంచి లీకేజ్ లు , అక్ర‌మ ఆస్తుల నుంచి దృష్టి మ‌ళ్లించేందుకే ప్ర‌భుత్వం ఈ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డింద‌న్నారు..

సంజయ్‌ అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చెప్పారు. బిఆర్ ఎస్ కు కాలం చెల్లిందని.. ప్రజలు త్వరలోనే ఆ పార్టీకి బుద్ధి చెబుతారని ఆమె వ్యాఖ్యానించారు. ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ అని కూడా చూడకుండా అక్రమంగా అరెస్ట్ చేయడం సిగ్గుమాలిన చర్యగా అరుణ అభివర్ణించారు.

నా భ‌ర్త‌కు మెడిసిన్ కూడా ఇవ్వ‌నివ్వ‌లేదు ..అప‌ర్ణ‌
పోలీసులు లాక్కెళ్లిన సమయంలో కింద పడిన బండి సంజయ్ మూతికి దెబ్బతగిలిందని.. కనీసం నీళ్లు కూడా ఇవ్వనీయలేదని బండి సంజయ్ భార్య అపర్ణ అన్నారు. తీసుకెళుతున్న సమయంలో మమ్మల్ని ఇంట్లో పెట్టి తలుపులు మూసివేశారని.. బయటకు కూడా రానీయలేదన్నారామె. ఇంటికి వచ్చిన పోలీసులు అందరూ కరీంనగర్ కు చెందిన వాళ్లే అన్నారు. అల్లుడికి బాధ్యతలు నిర్వహించటానికి వచ్చిన బండి సంజయ్ ను.. ఇలాంటి సమయంలో అరెస్ట్ చేయటం ఏంటన్నారు. ప్రభుత్వం కుట్రలు చేస్తే భయపడే రకం కాదని.. అర్థరాత్రి వచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు బండి సంజయ్ భార్య అపర్ణ. క‌నీసం మందులు వేసుకునే స‌మ‌యం కూడా ఇవ్వ‌కుండా లాక్కుపోయారంటూ క‌న్నీళ్లు పెట్టుకున్నారు.. పాటించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసిన భాజపా
సంజయ్‌ అరెస్ట్‌పై భాజపా హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు హౌస్‌మోషన్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. అర్ధరాత్రి ఆయన్ను అక్రమంగా అరెస్ట్‌ చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement