ఉమ్మడి వరంగల్, ప్రభన్యూస్ బ్యూరో: ఓరుగల్లు గడ్డ పోరాటాల గడ్డ.. క్విట్ ఇండియా ఉద్యమానికి ఊపిరి ఊదిన ఖిల్లా… నిజాం నవాబును కూల్చేవరకు మడమ తిప్పని జిల్లా.. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదిన జిల్లా.. అడుగడుగునా అవమానాలు భరిస్తూ.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన సర్వస్వాన్ని ధారపోసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ పుట్టిన జిల్లా.. జనసంఘ్ నుంచి బీజేపీ వరకు కాషాయ జెండాను ఎగురవేయాలని నక్సలైట్లకు ఎదురొడ్డి ప్రాణాలు అర్పించిన మా సామా జగన్మోహన్రెడ్డి పుట్టిన గడ్డ.. ఇయ్యాల కేసీఆర్ కుటుంబ అవినీతి నియంత పాలనకు వ్యతిరేకంగా లాఠీల దెబ్బలు తింటుంది కూడా ఓరుగల్లు వీరులే.. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం ప్రాణత్యాగాలకు కూడా వెనుకాడేదిలేదు.. రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతం చేసి కాషాయ జెండాను ఎగురవేసేందుకు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వడంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలు ఉంటే అందులో కోటి మంది బీజేపీతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసివస్తున్నారంటూ సంజయ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న తనను ఎస్సెస్సీ పేపర్ లీకేజీ పేరుతో ఇదే గడ్డపైన పోలీసులు అరెస్టు చేసి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు, కవిత లిక్కర్ స్కాంలను పక్కదారి పట్టించేందుల కుట్రలు చేశారని సంజయ్ ఆరోపించారు. అందుకే ఇదే గడ్డపై నుంచి నిరుద్యోగ మార్చ్‌ను ప్రారంభించామని సంజయ్ తెలిపారు.
హనుమకొండ జిల్లా కేంద్రంలోని కాకతీయ విశ్వవిద్యాలయం జంక్షన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు వేలాది మంది నిరుద్యోగ యువకులు, బీజేపీ కార్యకర్తలు ని రుద్యోగ మార్చ్‌ని ని ర్వహించగా, బండి సంజయ్, ఓబీసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ాంవు ని రుద్యోగ మార్చ్‌లో జిల్లా నేతలతో కలిసి ముందువరుసలో నడిచారు.
రాష్ట్రంలో 30లక్షల మంది జీవితాలను సర్వనాశనం చేసిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ వ్యవహరంలో మీ బండారం బయటపడుతుందనే టీఎస్పీఎస్సీ కమిటీ చైర్మన్‌ను తొలగించలేదు. కమిటిని రద్దుచేయలేదన్నారు. తప్పుచేశారంటూ మంత్రివర్గంలో ఉన్న ఈటల రాజేందర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రిని మంత్రివర్గం నుంచి తొలగించారు. పది మంది ఎమ్మెల్యేలను బయటకు పంపించారు. మరి లిక్కర్ స్కాంలో ఉన్న బిడ్డ కవితపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో ప్రధాన సూత్రధారుడిగా ఉన్న కొడుకు కేటిఆర్‌ను మంత్రివర్గం నుంచి ఎందుకు తొలగి ంచడంలేదు. పార్టీ నుంచి మెడలు పట్టి బయటకు ఎందుకు తోయడంలేదని బండి సంజయ్ ప్రశ్నించారు.
పేపర్ లీకేజీ వ్యవహరంలో సిట్టింగ్ జడ్జీతోనే న్యాయ విచారణజరిపించాలని డిమాండ్ చెెస్తున్నారు. సిట్ విచారణకు అంగీకరించేదిలేదన్నారు. నిరుద్యోగుల సమస్యలకు పరిష్కారం లభించేవరకు నిర ుద్యోగులకు అండగా భారతీయ జనతాపార్టీ అండగా ఉంటుంది . రాష్ట్రంలోని 30లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం జరగాలనే వరంగల్ గడ్డపై నిరుద్యోగ మార్చ్ ను ప్రారంభించామని, ఇది ఇక్కడితో ఆగదు. రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో నిరుద్యోగ మార్చ్‌ను నిర్వహిస్తామని బండి సంజయ్ తెలిపారు. ఏప్రిల్ 21న పాలమూరు గడ్డపై ని రుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌కు అంబేద్కర్ అన్నా..బాబుజగ్జీవన్‌రామ్ అన్నా…పూలే అన్న గౌరవం లేదని బండి సంజయ్ విమర్శించారు.
తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ ను తలపిస్తున్న నిరుద్యోగ మార్చ్ రాష్ట్రంలో కేసిఆర్ ప్రభుత్వ పతనానికి వరంగల్ గడ్డమీద జరుగుతున్న నిరుద్యోగ మార్చ్ నాందీ పలుకుతుందని బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్అన్నారు.
రాష్ట్రంలో నియంత కేసిఆర్ పాలనను కూకటివేళ్లతో కూల్చివేయడానికి అందరి జెండా ఒక్కటి కావాలి…అందరి ఏజెండా ఒక్కటి కావాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. కేసిఆర్ ప్రభుత్వం గంగలోకలవడం ఖాయమని ఈటల రాజేందర్ జోష్యం చెప్పారు. విద్యార్దుల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్న కేసిఆర్ కళ్లు తెరిపించడానికే బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నామన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై కేసిఆర్, కేటిఆర్ నైతిక బాధ్యత వహించకపోగా, బీజేపీ నాయకులపై అక్రమ కేసులు మోపి అరెస్టులు చేయించడం సిగ్గుమాలిన చర్య అని రాజేందర్ అన్నారు. కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమెందర్‌రెడ్డి, బంగారు శృతి, మాజీ ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, చాడా సురేష్‌రెడ్డి, హనుమకొండ,వరంగల్ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, కొండేటి శ్రీధర్, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, రేవూరి ప్రకాష్‌రెడ్డి, బీజేపీ నేతలు చందుపట్ల కీర్తిరెడ్డి, ఏనుగుల రాకేష్రె డ్డి, చింతలపూడి భాస్కర్‌రెడ్డి, జాటోతు హుస్సేన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.