ప్రభుత్వ హాస్పిటళ్లలో పనిచేస్తూ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్లపై తెలంగాణ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. దీనిలో భాగంగా ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఇవ్వాల (మంగళవారం) ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెంబర్ 56 ద్వారా ఈ గైడ్‌లైన్స్ జారీ అయ్యాయి. అయితే.. కొత్తగా ఉద్యోగాల్లో చేరే డాక్టర్లు మాత్రమే ఈ నిబంధన పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీస్‌కు మాత్రం ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Breaking: ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై నిషేధం.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Advertisement
తాజా వార్తలు
Advertisement