తెలంగాణలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం 10 రోజుల పాటు లాక్‌డౌన్ విధించింది. దీంతో ఉ.10 గంటల తర్వాత అత్యవసరం అయితే తప్ప ప్రజలు రోడ్లపైకి రాకూడదు. ఒకవేళ వస్తే వాహనాలను సీజ్ చేసి సదరు వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అయితే లాక్‌డౌన్ సమయంలో రాజకీయ నేతలు రోడ్లపై సంబరాలు నిర్వహించడంపై పలు విమర్శలు వస్తున్నాయి. తొలిరోజు లాక్‌డౌన్ సమయంలో బాలానగర్ టీఆర్ఎస్ కార్పొరేటర్ రవీందర్‌రెడ్డి జన్మదిన సంబరాలను రోడ్డుపై నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా ఈ సంబరాల్లో పాల్గొన్నారు. దీంతో ప్రజలకు వర్తించే లాక్‌డౌన్ నిబంధనలు అధికార పార్టీ నేతలకు వర్తించవా అంటూ సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంబరాలకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement