డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో హీరో బాలకృష్ణ 107వ సినిమాని చేయనున్నాడు. ఈ చిత్ర షూటింగ్ నేడు సిరిసిల్లలో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా శ్రుతి హాసన్ ను నటిస్తోంది. క్రితం ఏడాది గోపీచంద్ మలినేని ‘క్రాక్’ సినిమాతో హిట్ ఇచ్చాడు. ఆ సినిమా చూసిన బాలయ్య ఆయనను పిలిచిమరీ ఛాన్స్ ఇచ్చారు. బాలయ్య ఇంతకుముందు రాయలసీమ నేపథ్యంలో చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ హిట్స్ అనిపించుకున్నాయి. అందువలన అదే నేపథ్యంలో గోపీచంద్ మలినేని కథను రెడీ చేసుకున్నాడు. వేటపాలెం’లో జరిగిన ఒక సంఘటన చుట్టూ ఈ కథ తిరగనుందట. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..