Wednesday, November 20, 2024

గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానికి బెయిల్

గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానికి ఊరట లభించింది. మహిళా పోలీసు అధికారిని దుర్భాషలాడడంతో పాటు దాడిచేసిన ఆరోపణలపై అరెస్ట్ అయిన గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానికి అస్సాంలోని బార్పెటా కోర్టు బెయిలు మంజూరు చేసింది. బెయిలు లభించడంతో సాయంత్రం ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా ట్వీట్ చేశారన్న ఆరోపణలపై ఈనెల 20న మేవాని అరెస్టయ్యారు. ఆ కేసులో ఆయనకు సోమవారం బెయిల్ లభించింది. అయితే, ఆ వెంటనే ఆయనను అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా పోలీసు అధికారితో అనుచితంగా ప్రవర్తించిన ఆరోపణలపై మేవాని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement