బాలీవుడ్ నటుడు, నిర్మాత కమల్ ఆర్ ఖాన్ అలియాస్ కేఆర్కేకు ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వేధింపుల కేసులో గత నెలలో ఆయనను పోలీసులు ముంబై ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కోర్టు బెయిల్ మంజూరు చేసినా కేఆర్కే జైలులోనే ఉండనున్నాడు. కేఆర్ కేను ఆగస్టు 30న అరెస్టు పోలీసులు అరెస్టు చేయగా.. బోరవలి కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. వెర్సోవా పోలీసులు కేఆర్కేను వేధింపుల కేసులో అదుపులోకి తీసుకొని బాంద్రా కోర్టులో హాజరుపరిచారు. ఎఫ్ఐఆర్లోని అంశాలు ఆచరణాత్మకంగా వేధింపుల ఘటనతో సరిపోలడం లేదని కోర్టు దృష్టికి కేఆర్కే లాయర్ పేర్కొన్నారు. ఘటన జరిగిన 18 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైందని, బాధితురాలి స్నేహితురాలు చెప్పిన తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదైందని, బెయిల్ ఇవ్వాలని కోరాగా.. కోర్టు బెయిల్ ఇచ్చింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement