ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఘోరం జరిగింది. లోన్ యాప్ ఆగడాలకు ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఇంజనీరింగ్ విద్యార్థి వీరేంద్రనాథ్ తమ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరేంద్రనాథ్ బెంగళూరులో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఈ ఇంజనీరింగ్ విద్యార్థి తన చదువు నిమిత్తం లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నాడు. తీసుకున్న లోన్ చెల్లించాలని విద్యార్థిపై యాప్ నిర్వాహకులు ఒత్తిళ్లు పెంచడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
- Advertisement -