Friday, November 22, 2024

పిల్లల్ని కంటే రూ.25 లక్షల రుణం..

యువ జనాభా తగ్గుదల చైనాకు సవాల్‌గా మారింది. రోజురోజుకు వృద్ధుల సంఖ్య పెరుగుతుండటం, జననాలు తగ్గుతుండం డ్రాగన్‌ను కలవరపెడుతోంది. జననాల తిరోగమనాన్ని తిప్పికొట్టడానికి ప్రయత్నాలు చేస్తోంది. జనాభా తగ్గుదల సమస్య అధికంగా ఉన్న చైనీస్‌ ప్రావిన్స్‌లో స్థానిక ప్రభుత్వం యువ జంటలను సంతానం దిశగా ప్రోత్సహించేందుకు బంపర్‌ ఆఫర్లు ప్రకటించింది. వారికోసం ప్రత్యేక రుణాలు అందిస్తోంది. ఈశాన్య చైనాలోని జిలిన్‌ ప్రావిన్స్‌ ఈ రకమైన పథకానికి తెరలేపింది.

వివాహిత జంటలకు దాదాపు రూ.25 లక్షలు రుణంగా ఇస్తామని ప్రకటించింది. దంపతులకు ఉన్న పిల్లల సంఖ్యను బట్టి రుణాలపై వడ్డీని కూడా తగ్గిస్తారట. జిలిన్‌ ప్రావిన్స్‌లోకి పిల్లాజల్లతో వచ్చే వారికీ ఈ పథకాలు వర్తింపజేస్తారట. ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలున్న జంటలు చిన్న వ్యాపారం ప్రారంభిస్తే వారికి పన్ను రాయితీలు కూడా లభిస్తాయి. ప్రసూతి, పితృత్వ సెలవులు లభిస్తాయి. మహిళలకు 180 రోజులు, పురుషులకు 25 రోజులు సెలవులు ఇస్తారట.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement