Saturday, November 23, 2024

Heart breaking: రోడ్డు విస్తరణలో ఘోరం, జేసీబీతో చెట్టు తొలగింపు.. గూడుచెదిరి చనిపోయిన పక్షులు

రోడ్డు విస్తరణ కోసం చేపట్టిన పనుల్లో ఓ చెట్టును తొలగించారు అధికారులు. అయితే.. ఆ చెట్టు కిందపడడంతో దానిపై గూడు పెట్టుకున్న చాలా పక్షులు ఒక్కసారిగా ఎగరలేక, కిందపడి చనిపోయాయి. గూడు చెదిరి కొన్ని ఎగిరిపోతే.. ఎగరలేని స్థితిలో ఉన్న పిల్లలు చనిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఈ వీడియోని ఇండియన్​ ఫారెస్ట్​ సర్వీస్​ ఆఫీసర్​ ట్వీట్​ చేశారు. అది చూసిన వారు సిరియస్​గా రియాక్ట్​ అవుతున్నారు. ఇంత కఠినంగా ఎట్లా వ్యవహరిస్తారని కామెంట్స్​ చేస్తున్నారు. ఆయన ట్వీట్​ చేసిన 44 సెకన్లలోనే 7వేల మందికి పైగా రీట్వీట్​ చేశారు. ఈ ఘటన కేరళ రాష్ట్రం మలప్పురంలో జరిగింది.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

 సోషల్ మీడియాలో వైరల్ అయిన విజువల్స్ ప్రకారం.. కేరళలోని మలప్పురం జిల్లాలో తిరురంగడిలోని వీకే పాడి నుండి వచ్చాయి. జాతీయ రహదారి విస్తరణ కోసం మలప్పురం ప్రాంతంలో జేసీబీతో చెట్టును తొలగించారు. ఆ చెట్టు కూలిపోవడంతో దాన్ని చూసిన ప్రజలు షాక్‌కు గురయ్యారు. అనేక పక్షులు గూడు కట్టుకుని ఉండటంతో ఆ చెట్టు కూలిపోవడం చూసిన ప్రతి ఒక్కరి హృదయాల్లో విషాదం నిండిపోతోంది.

వాటిలో కొన్ని సురక్షితంగా ఎగిరి విధి నుండి తప్పించుకోగలిగితే, ఇంకా ఇప్పుడిప్పుడే ఎగరడం నేర్చుకుంటున్న కొన్ని పిల్లలు తమను తాము రక్షించుకోలేకపోయాయి.  ఇక.. ఈ వీడియో మొదటి 20-సెకన్లలో ఆ చెట్టు కూలిపోయే దృష్యాలు కనిపిస్తాయి. అయితే మిగితా వీడియో అందరి హృదయాలను కదిలిస్తుంది. ఎగరడానికి సాధ్యం కాక, తప్పించుకోవడానికి కూడా తగినంత వయస్సు లేని అనేక పక్షి పిల్లలు కిందపడడం కనిపిస్తుంది.

అనుమతి లేకుండా చెట్టును నరికివేశారు..

- Advertisement -

ఈ ఘటనపై కేరళ అటవీ శాఖ, వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు అయ్యింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎట్లాంటి అనుమతి లేకుండా ఆ చెట్టును నరికివేశారు. అనంతరం జేసీబీ నడిపిన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అటవీ శాఖ మంత్రి ఎకె శశీంద్రన్ ఈ ఘటనను క్రూరమైనదిగా అభివర్ణించారు. ఇది తమ శాఖ అనుమతి లేకుండా జరిగిందని అన్నారు.

పక్షులు, గూళ్లు ఉన్న చెట్లను నరికివేయరాదని అటవీ శాఖ నుంచి కఠినమైన మార్గదర్శకాలు ఉన్నాయని తెలిపారు. ఇక.. పీడబ్ల్యూడీ మంత్రి ముహమ్మద్ రియాస్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి నివేదిక కోరారు. దీనిపై తదుపరి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని నిలంబూరు నార్త్ డివిజనల్ అధికారి తెలిపారు.

వీడియో కోసం www.prabhanews.comలో చూడండి

Advertisement

తాజా వార్తలు

Advertisement