B.1.617 భారత్ రకం స్ట్రెయిన్ అని WHO ఎక్కడా చెప్పలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మీడియా సంస్థలే అలా వాడుతున్నాయని పేర్కొంది. భారత రకం కరోనా వైరస్ ప్రపంచానికి ఆందోళనకరమని డబ్ల్యూహెచ్‌ఓ చెప్పినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఆ వార్తలు నిరాధారం, అవాస్తవమని కేంద్రం పేర్కొంది. కరోనా వైరస్‌ల విషయంలో డబ్ల్యూహెచ్‌వో 32 పేజీల నివేదిక ఇచ్చింది. అందులో ఎక్కడా ‘భారత్’ అనే పదం లేదు’’అని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది.
భారత్‌లో వెలుగుచూసిన ఈ వైరస్ వ్యాప్తి తీవ్రత గురించి తమకు అవగాహన ఉందని, దీనిపై అధ్యయనాలను పరిశీలిస్తున్నామని డబ్ల్యూహెచ్‌ఓ కొవిడ్ విభాగ సాంకేతిక నిపుణురాలు డా. మరియా వాన్ కేర్‌ఖోవ్ పేర్కొన్నారు. ఈ స్ట్రెయిన్ వ్యాప్తి తీవ్రంగా ఉందని, ఇది ప్రపంచానికి ఆందోళనకరమని గుర్తించినట్లు పేర్కొన్నారు. అయితే ఇదంతా ప్రాథమిక సమాచారం మాత్రమేనని, దీనిపై లోతుగా అధ్యయనం చేయాల్సినం అవసరం ఉందని చెప్పారు.