రామ మందిర నిర్మాణం వీడియోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ రిలీజ్ చేసింది. ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్న తీరు, ఆలయంలో పలు ప్రదేశాలు, ఆలయానికి దారితీసే రహదారి మార్గంలాంటి అంశాలను ఈ వీడియోలో చూపించారు. కాగా ఈ వీడియో నిడివి ఐదు నిమిషాలు ఉంది. కాగా ఈ వీడియోని 3డీ యానిమేషన్ విధానంలో రూపొందించారు. 2020 ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2023 డిసెంబరు నుంచి భక్తుల సందర్శనకు అనుమతి ఇవ్వనున్నారు.అయోధ్యలో రామ జన్మభూమి ప్రదేశంలో రామ మందిరం నిర్మాణం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..