ఇండియా క్రికెటర్ అక్షర్ పటేల్ తన లాంగ్‌టైమ్ పార్ట్నర్ మేహా పటేల్‌ను పెళ్లాడాడు..కాగా వివాహం కారణంగా కివీస్‌తో సిరీస్‌కు దూరమయ్యాడు. గుజరాత్‌లోని వడోదరలో కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది స్నేహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. సంప్రదాయ గుజరాతీ వస్త్రాలు ధరించిన వధూవరులు పెళ్లిలో చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అయింది. ‘మాన్ మేరీ జాన్’ పాటకు ఇద్దరూ స్టెప్పులేసి అందరినీ అలరించారు. అంతకుముందు జరిగిన సంగీత్, మెహందీ కార్యక్రమాల్లోనూ ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు. పెళ్లి తర్వాత జరిగిన బరాత్లోనూ అక్షర్ డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
మేహా పటేల్ ని పెళ్లాడిన అక్షర్ పటేల్.. స్టెప్పులతో అలరించిన క్రికెటర్
Advertisement
తాజా వార్తలు
Advertisement