నటి మంజు వారియర్‌ను వెంబడించి వేధించిన ఆరోపణలపై అవార్డు గ్రహీత మలయాళ చిత్ర దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మంజు వారియర్ ‘కయాట్టమ్’ షూటింగ్ సెట్‌లో ఆమె మేనేజర్‌తో వివాదం తలెత్తడంతో సమస్యలు మొదలయ్యాయి. సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత సనల్ కుమార్ మంజు వారియర్‌ను కలవడానికి చాలాసార్లు ప్రయత్నించాడు. అయితే అతని ప్రవర్తన బాగాలేదని ఆమె గుర్తించింది. దీంతో ఆమెను చూడటానికి కానీ, మాట్లాడటానికి కానీ అంగీకరించలేదు. దీని తర్వాత మంజు వారియర్ ప్రాణాలకు ముప్పు ఉందని, ఆమె కొంతమంది కస్టడీలో ఉందని.. ఆమెను రక్షించడానికి ప్రజలు జోక్యం చేసుకోవాలని సనల్ కుమార్ సోషల్ మీడియాలో ప్రచారం మొదలెట్టాడు.
మంజు ప్రధాన పాత్రలో ‘కాయట్టం’ సినిమాను డైరెక్ట్ చేశానని ఆమె డైరెక్ట్ గా ఫోన్ చేసిందని సనల్ కుమార్ పేర్కొన్నాడు. సనల్ కుమార్ శశిధరన్ మంజు వారియర్‌తో మరో చిత్రానికి దర్శకత్వం వహించాలనే ఉద్దేశంతో కొంతమంది నిర్మాతలు, ప్రైవేట్ ఆర్థిక సంస్థలను సంప్రదించారు. గురువారం తిరువనంతపురంలో పోలీసులు సనల్ కుమార్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించినప్పుడు నాటకీయ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. భయాందోళనకు గురైన సనల్ కుమార్ శశిధరన్ సోషల్ మీడియాలో లైవ్ వీడియోను చిత్రీకరించాడు. తన ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పాడు. మంజు వారియర్ తనపై ఎర్నాకుళం జిల్లాలోని ఎలమక్కర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం పోలీసులు తిరువనంతపురంలో చేరుకునే వరకు సనల్ కుమార్‌కు తెలియదు.