– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
శ్రీనగర్-కార్గిల్ హైవేపై మంచుకొండలు విరిగిపడి, టూరిస్టుల వాహనాలకు ప్రమాదానికి గురైన ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని ఇండియన్ ఆర్మీ రెస్క్యూ టీమ్ వెల్లడించింది. ప్రమాదంలో గాయపడిన వారిని వాహనాలలో తరలించేందుకు చర్యలు చేపట్టారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో వాహనాలను బయటకు తీసుకెళ్లలేకపోతున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, ఈ ప్రాంతంలో ప్రత్యేక శిక్షణ పొందిన అవలాంచె రెస్క్యూ టీమ్‌తో పాటు వైద్య బృందాలు నిమగ్నమై ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. రెస్క్యూ టీమ్‌లు ఎమర్జెన్సీ మెడికల్ కిట్లతో రెడీగా ఉన్నాయని, ముందస్తు రెస్క్యూ కోసం అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్టు ఆర్మీ అధికారులు తెలిపారు.
సహాయక చర్యలు సోమవారం రాత్రి దాకా కొనసాగుతున్నాయి. ఈ వాహనాలు శ్రీనగర్ నుంచి కార్గిల్‌కు వెళ్తున్నట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత శ్రీనగర్-కార్గిల్ హైవేని తాత్కాలికంగా క్లోజ్ చేశారు. ముఖ్యంగా జోజిలా పాస్ వద్ద మంచు కారణంగా హైవేపై మంచును తొలగించే ఆపరేషన్‌కు కూడా ఆటంకం కలుగుతోంది. ఇక.. జమ్మూ కాశ్మీర్ విపత్తు నిర్వహణ అథారిటీ (JKDMA) రానున్న 24 గంటలపాటు హిమపాతం హెచ్చరికను జారీ చేసింది. బారాముల్లాలో రాబోయే 24 గంటల్లో ప్రమాదకర స్థాయిలో హిమపాతం సంభవించే అవకాశం ఉందని తెలపింది. ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు.