Friday, November 22, 2024

హిమ‌పాతం బీభ‌త్సం : ఏడుగురు భారత సైనికాధికారులు గల్లంతు

హిమ‌పాత బీభ‌త్సం సృష్టించ‌డంతో ఏడుగురు భార‌త సైనికాధికారులు గ‌ల్లంతైన విషాధ ఘ‌ట‌న అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో జ‌రిగింది. అరుణాచల్ ప్రదేశ్ లో భారీ హిమపాతం బీభత్సం సృష్టించింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న మంచు తుఫాను ధాటికి పశ్చిమ కమెంగ్ జిల్లా మొత్తం అతలాకుతలమైంది. జిల్లాలో అతి ఎత్తైన పర్వత శ్రేణుల్లో మంచు చరియలు విరిగిపడి..ఏడుగురు భారత సైనికాధికారులు గల్లంతయ్యారు. గల్లంతైన వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు.

హిమపాతం సమయంలో కొండ ప్రాంతాల్లో గస్తీ తిరుగుతున్న ఏడుగురు సైనికాధికారులు గల్లంతైనట్లు లెఫ్టినెంట్ కల్నల్ హర్షవర్ధన్ పాండే తెలిపారు. గల్లంతైన వారికోసం ప్రత్యేక బృందాలను వాయుమార్గాన మోహరింపజేసి గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో విపరీతమైన హిమపాతంతో ప్రతికూల వాతావరణం నెలకొందని కల్నల్ హర్షవర్ధన్ పాండే తెలిపారు. దీంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతున్నట్లు ఆయన వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement