Monday, November 18, 2024

విరుచుకుప‌డిన హిమ‌పాతం.. ప‌ది మంది మృతి

హిమాల‌య ప‌ర్వ‌తాల్లో హిమ‌పాతం విరుచుకుప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో ప‌ది మంది మృతి చెందారు. 25మంది గాయ‌ప‌డ‌గా వారిలో 12మంది ప‌రిస్థితి విష‌మంగా ఉంది.ఈ సంఘ‌ట‌న పాక్‌ ఆక్రమిత గిల్గిట్‌-బాల్టిస్థాన్ రీజియన్‌లోని హిమాలయ పర్వతాల్లో చోటు చేసుకుంది. కాగా మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. పర్వత ప్రాంతంలోని ఆస్టోర్‌ జిల్లాలోని షంటర్‌ టాప్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. గుజ్జర్‌ కుటుంబానికి చెందిన 25 మంది పీఓకే నుంచి ఆస్టోర్‌కు తమ పశువులతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. హిమపాతం కింద చిక్కుకున్న మృతదేహాలను తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ జరుగుతున్నదని చెప్పారు. గాయపడినవారిలో 13 మందిని దవాఖానకు తరలించారు.
ఈ దుర్గటనపై పాక్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల నుంచి పాక్‌ను రక్షించాలని ప్రపంచ దేశాలను అభ్యర్థించారు. మృతుల కుటుంబాలకు గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ ముఖ్యమంత్రి ఖలీద్‌ ఖుర్షీద్ సంతాపం వ్యక్తంచేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement