Thursday, November 21, 2024

ఉక్రెయిన్ కు ఆస్ట్రేలియా ఆయుధ సహకారం

రష్యా-ఉక్రెయిన్ ల మ‌ధ్య గ‌త ఆరు రోజులుగా వార్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే.. అయితే ఉక్రెయిన్ అధ్య‌క్షుడు ప్ర‌పంచ దేశాల‌ను యుద్ధంను ఆపాల‌ని కోరుకుంటున్నాడు. అయితే ర‌ష్యా మాత్రం భీక‌రంగా యుద్ధం చేస్తూనే… కీల‌క న‌గ‌రాల‌ను ఆక్ర‌మించుకుంటూ వెళ్తోంది. అయితే ఉక్రెయిన్ కు ఆస్ట్రేలియాకు స‌హ‌కారం అందించేందుకు ముందుకొచ్చింది. ఉక్రెయిన్‌కు ఆయుధ స‌హ‌కారం అందించేందుకు ఆస్ట్రేలియా సుముఖ‌త వ్య‌క్తం చేసింది. ఉక్రెయిన్ అధ్య‌క్షుడు వోల్డోమిర్ జెలెన్‌స్కీకి ప్రాణాంత‌క‌మైన సైనిక సామాగ్రిని అందించ‌నున్న‌ట్లు ఆస్ట్రేలియా ప్ర‌ధాని స్కాట్ మారిస‌న్ తెలిపారు. ర‌ష్యా దాడితో కుదేల‌వుతున్న ఉక్రెయిన్‌ను ఆదుకునేందుకు ఆ దేశానికి 50 మిలియ‌న్ల డాల‌ర్ల ఖ‌రీదైన ఆయుధ సామాగ్రిని అందించ‌నున్న‌ట్లు ఆస్ట్రేలియా చెప్పింది. ఆ జాబితాలో మిస్సైళ్లు, మందుగుండు సామాగ్రి, మిలిట‌రీ హార్డ్‌వేర్ ఉన్న‌ట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement