దిగ్గజ క్రికెటర్, ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ రాడ్ మార్ష్ కన్నుమూశారు. ఆయన వయసు 74 ఏళ్ల. క్వీన్స్ లాండ్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో పాల్గొన్న మార్ష్‌కు గుండె పోటు వచ్చింది. దీంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారం రోజుల పాటు చికిత్స పొందిన రాడ్ మార్ష్ ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. దీంతో మార్ష్ మృతి పట్ల క్రికెట్ ప్రపంచం సంతాపం తెలుపుతోంది. అనేక మంది ఆటగాళ్లు మార్ష్ మృతికి నివాళులు అర్పిస్తున్నారు.
కాగా, ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్‌లో మార్ష్ ఒకరు. 1970 నుంచి 1984 మధ్య కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌లో మార్ష్ ఆడారు. కెరీర్‌లో రాడ్ మార్ష్ 96 టెస్టు మ్యాచ్‌లు, 92 వన్డే మ్యాచ్‌లు ఆడారు. ఈ క్రమంలో అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు.