యుక్త వయస్సులో ఉన్న బోయ్‌ని తన విషవలయంలోకి లాగింది. ఆ తర్వాత తను చేస్తున్న పనిని వీడియోలు తీయించింది. ఆపైన వాటిని చూపి బెదిరింపులకు పాల్పడింది. అంతేకాకుండా తనకు డబ్బు, బంగారు నగలు ఇవ్వాలని లేకుంటే వీటిని బయటపెడతానని.. కుటుంబం పరువు తీస్తానని హెచ్చరించడంతో ఆ బాలుడు ఆమె చిప్పనట్టు చేశాడు.. ఇదంతా హైదరాబాద్‌లోని ఓ హైక్లాస్ లొకాలిటీలో జరిగిన తతంగం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
హైదరాబాద్‌లో ఓ మహిళ తన 14 ఏళ్ల మేనల్లుడిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా తెలిసింది. కొద్దిరోజులుగా బాలుడితో శారీరక వాంఛలు తీర్చుకుంటున్న అతని మేనత్త.. వాటిని రికార్డు చేయడమే కాకుండా.. ఆ వీడియోలను అడ్డుపెట్టుకుని అతనిపై బెదిరింపులకు పాల్పడుతోంది. ఆ బెదిరింపులకు భయపడిపోయిన బాలుడు తన సొంతింట్లో నుంచి బంగారు ఆభరణాలు, క్యాష్ దొంగిలించి ఆమెకు ఇచ్చాడు. ఈ విషయం కాస్త బాధిత బాలుడి తల్లికి తెలియడంతో ఆమె పోలీసులకు కంప్లెయింట్ చేసింది.
హైదరాబాద్‌లోని టోలీచౌకి ప్రాంతంలో నివసించే ఓ కుటుంబం కొద్ది నెలల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నం.10లోని గాయత్రిహిల్స్‌కు మారింది. ఈ మధ్య ఓరోజు ఆ ఇంటి మహిళ అలమారాలో ఏదో సర్దుతుండగా.. అందులో ఉండాల్సిన నగలు లేకపోవడాన్ని గమనించింది. ఇంట్లో అన్ని గదుల్లో ఆమె నగల కోసం వెతుకుతుండగా ఆమె కొడుకు (14) ఆరా తీశాడు. తల్లి వెతుకుతున్న నెక్లెస్‌ను తానే తీశానని… దాన్ని మేనత్తకు ఇచ్చానని చెప్పాడు. ఎందుకిచ్చావని తల్లి అడగ్గా… షాకింగ్ విషయాలు బయటపెట్టాడు.
బెంగళూరులో ఉండే మేనత్త తన బాయ్‌ఫ్రెండ్ ఇర్ఫాన్‌తో అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తుండేదని.. ఆ సమయంలో తనను కూడా వారు ఉండే లాడ్జికి తీసుకెళ్లేవారని చెప్పాడు. అక్కడ మేనత్త తనతో శారీరక వాంఛలు తీర్చుకునేదని… ఆ తతంగమంతా ఇర్ఫాన్ వీడియో తీసేవాడని తెలిపాడు. ఆ వీడియోలను అడ్డుపెట్టుకుని తనను బెదిరించారని తల్లితో చెప్పాడు. ఇంట్లో నుంచి డబ్బు, బంగారం తీసుకురాకపోతే ఆ వీడియోలు లీక్ చేస్తామని బ్లాక్‌మెయిల్ చేశారన్నాడు.
అందుకే ఇంట్లోని అల్మారా నుంచి 20 తులాల బంగారంతో పాటు రూ.6లక్షలు దొంగిలించి మేనత్తకు ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు. కొడుకు చెప్పింది విని షాక్ తిన్న ఆ తల్లి.. జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఆ మహిళపై కంప్లెయింట్ చేసింది. దీంతో పోలీసులు నిందితురాలిపై ఐపీసీ సెక్షన్ 384, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..