ప్రపంచంలో కోవిడ్ -19 మహమ్మారి విజృం భించినప్పు డు విధించిన లాక్‌డౌన్ మనుషు లను ఇళ్లకే పరిమితం చేసింది. దాదాపు గృహనిర్బంధం లో ఉన్నట్టే జీవించాల్సి వచ్చింది. కానీ ఈ లాక్‌డౌన్ వన్యప్రాణులకు మాత్రం ఎనలేని స్వేచ్ఛను ప్రసా దిం చింది. ఎన్నడూ లేనివిధంగా అవి తమకు నచ్చిన చోటుకు.. నచ్చినంత దూరం సంచరించా యి. మాన వుల నుండి ముప్పులేదని గ్రహించి, అవి రహదారు లకు అతి దగ్గ రగా కూడా వచ్చాయి. ఆహారం, నీటి కోసం జంకూగొంకూ లేకుం డా తిరిగాయి. లాక్‌డౌన్ కు ముందు, తరువాత వన్య ప్రాణుల ప్రవర్తనలో వచ్చిన మార్పుపై జరిగిన అధ్యయనంలో ఆశ్చ ర్యంగొలిపే అంశాలు వెలుగుచూశాయి.
2020-21లో కోవిడ్ ఉధృతంగా ఉంది. ప్రపంచ మంతటా లాక్‌డౌన్ అమలు చేశారు. అందరూ ఇళ్లకే పరిమి తమయ్యారు. అనేక కష్టాలు పడ్డారు. మానవాళి విలవిల లాడి పోయింది. కానీ వన్యప్రాణులకు మాత్రం ఆ కాలం అపరిమిత స్వేచ్ఛ నిచ్చింది. భయం లేకుండా ఆహారాన్వేషణకు అవకా శం ఇచ్చింది. మానవ, వాహనాల సంచా రం లేకపోవడంతో అవి నచ్చినంత దూరం వెళ్లాయి. ఎన్నడూ లేని రీతిలో రహదారులకు అతి దగ్గరగావచ్చి సంచ రించాయి. లాక్‌డౌన్ వేళ వన్యప్రాణుల తీరులో వచ్చిన మార్పులపై ప్రపంచవ్యాప్తంగా 174మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు.
వారంతా ఒకచోటకు చేరి అధ్యయనం చేశారు. ఆ అధ్యయనం వివరాలను జర్నల్ సైన్స్‌లో ప్రచురించారు. లాక్‌డౌన్ కు ముందు, తరువాత 43 జాతులకు చెందిన 2300 క్షీరదాలకు జీపీఎస్ ట్రాకింగ్ డివైస్‌లు అమర్చారు. వాటి కదలికలకు సంబంధించిన సమాచా రాన్ని సేకరించారు. ఒక్క క్షీరదాల ప్రవర్తనలోనే కాదు… ప్రకృతిలో చాలా సానుకూల మార్పులు గోచరిం చాయి.. నదుల నీరు స్వచ్ఛం గా మారాయి. అడవులు కళ కళలాడాయి. విధ్వంసం తగ్గిం ది.. చిలీలోని శాంటియాగోలో రహదార్లపై కౌగార్‌లు స్వేచ్ఛ గా తిరగాడాయి. అని ఈ అధ్య యనానికి నాయకత్వం వహిం చిన మర్లీ ఎ. టక్కర్ పేర్కొ న్నారు.
2020 జనవరి – మే మధ్యలో క్షీరదాల కదలికలను జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా గుర్తించారు. ఇదే నెలలలోగత ఏడాది ఆయా జంతువులు ఎలా ప్రవర్తించాయి, ఎంత దూరం వెళ్లా యన్న సమాచా రాన్ని క్రోడీకరించారు. ఈ రెండు సందర్భాల సమా చారాన్ని పోల్చి చూశారు. లాక్‌డౌన్ సమయంలో అవి గతంకన్నా 76 శాతం ఎక్కువదూ రం (పదిరోజుల వ్యవధిలో) వెళ్లా యని, రహదార్లకు 36 శాతం దగ్గరగా తిరిగాయని గుర్తించారు. జన, వా హన సంచారం ఉన్న ప్రాంతా లకు దూరంగా ఉండి పోయాయని పసిగట్టారు. లాక్‌డౌన్ ఉన్నప్పటికీ కొ న్ని ప్రాంతాల్లో పర్యాటకులు తిరిగాడారు. అలాంటి చోటుకు అవి దూరంగా ఉండి పోయాయని టక్కర్‌తో కలసి పరిశోధనల్లో పాల్గొన్న థామస్ ముల్లర్ పేర్క న్నారు. మానవుల ప్రవర్తనను నేరుగా పసిగట్టి వన్యప్రాణులు లేదా క్షీరదాలు తమ వై ఖరిని మార్చుకోవడాన్ని గమ నించామని వారు తెలిపారు.