భారతదేశం స్వాతంత్ర్య వజ్రోత్సవాలు.. ఆజాదీకా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్న వేళ ఉత్తరప్రదేశ్‌లో మాత్రం దారుణ ఘటనలు ఆగడం లేదు. యూపీలో తాజాగా మరో దారుణ ఘటన వెలుగుచూసింది. వారణాసిలో అమానవీయ ఘటన జరిగింది. గౌరీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక విలేజ్‌లో 14 ఏళ్ల దళిత బాలికపై ముగ్గురు అగ్రవర్ణాలకి చెందిన వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా బయటికి వచ్చింది.
మొన్న రాత్రి బాలికను తోటలోకి లాక్కెళ్లి హిందూ ఫ్యామిలీస్‌కి చెందిన ఈ ముగ్గురు యువకులు అత్యంత దారుణానికి పాల్పడ్డారని ఎస్సీ ఎలమరన్జీ తెలిపారు. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి బాలికను గ్యాంగ్ రేప్ చేశారన్నారు. బాధిత బాలిక కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.