Tuesday, November 26, 2024

చండీగఢ్ లో దారుణం.. 8మంది విద్యార్థినుల ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. ఒక‌రు మృతి

పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్ లోని ఓ ప్రైవేట్ వర్సిటీలో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థినులు స్నానం చేస్తుండగా.. ఓ యువతి వీడియో తీసింది. వీడియోలు తీసిన ఆ యువతి ఓ యువకుడికి పంపింది. అయితే ఆ వీడియోలను యువకుడు నెట్ లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలు వైరల్ కావడంతో విద్యార్థినులు మనస్తాపం చెందారు. దీంతో ఎనిమిది మంది విద్యార్థినులు ఆత్మహత్యాయత్నం చేసుకోగా… ఒకరు మృతిచెందారు. వీడియోలు వైర‌ల్ చేసిన యువ‌తిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

యూనిరవ్శిటీలో స్నానం చేస్తున్న 60 మంది బాలికల నగ్న వీడియోలను మరో విద్యార్ధిని తీస్తూ పట్టుబడింది. సుమారు 60 మంది విద్యార్ధినుల నగ్న వీడియోలను తన స్నేహితుడికి పంపినట్టుగా గుర్తించారు. ఈ వీడియోలను అతను యూట్యూబ్ లో అప్ లోడ్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ విషయమై బాధిత విద్యార్ధినులు ఆందోళనకు దిగారు. మొహలీకి చెందిన విద్యార్ధిని యూనివర్శిటీలో చదువుతున్న తమ సహచర విద్యార్ధినుల నగ్న వీడియోలను తీసింది. స్నానం చేసే సమయంలో ఆమె ఈ వీడియోలను రికార్డు చేసింది. సిమ్లాలో ఉన్న తన స్నేహితుడికి ఈ వీడియోలను పంపింది. ఈ వీడియోలను నిందితుడు యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు. ఈ విషయం తెలిసిన బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడిందని స్థానిక మీడియా రిపోర్టు చేసింది.

ఈ యూనివర్శిటీ బయట బాధితులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ ఘటనపై పంజాబ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ స్పందించారు. ఘటనకు పాల్పడిన నిందితులపై చర్యలు తీసుకొంటామని ప్రకటించారు. యూనివర్శిటీలో విద్యార్ధులు ప్రశాంతంగా ఉండాలని ఆయన కోరారు. దోషులు ఎవరూ కూడ తప్పించుకోలేరని ఆయన తేల్చి చెప్పారు. ఈ విషయం అత్యంత సున్నితమైందన్నారు. ఇదీ పరీక్ష సమయంగా కూడా ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement