పెద్ద ఎత్తున ప్రజల్ని నిర్థాక్ష్యంగా చంపేస్తుంది మయన్మార్ సైన్యం. ఉద్యమకారురాలు ఆంగ్ సాంగ్ సూకీ ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకుంది సైన్యం. గత 11 నెలల క్రితం ప్రజాస్వామ్య ఆంగ్ సాంగ్ సూచి ప్రభుత్వాన్ని గద్దె దింపిన సైన్యం అప్పటి నుంచి మయన్మార్ లో పాలనను చేపట్టింది. అప్పటి నుంచి ఆదేశంలో కల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజల నుంచి వచ్చే నిరసనలను బలవంతంగా అణచివేస్తోంది అక్కడి ఆర్మీ. దాంతో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పునరుద్దరించాలని ఆ దేశ యువత పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఆందోళనాకారులని అణచివేసేందుకు మయన్మార్ లోని కయా రాష్ట్రం మోసో గ్రామంలో 30మందిని కాల్చి చంపింది సైన్యం. వారిలో ఎక్కువగా పిల్లలు, మహిళలు ఉన్నారని సమాచారం. శరణార్ధుల శిబిరానికి వెళుతుండగా ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే సైన్యం మాత్రం సాయుధులైన తిరుగుబాటుదారులను కాల్చి చంపినట్లుగా తెలిపింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..