బలవంతంగా కరనా పరీక్షలు చేయిస్తున్నారు చైనా అధికారులు. దాంతో చైనా ప్రభుత్వం పేద ప్రజలను కరోనా పరీక్షల పేరుతో ఎలా ఇబ్బందిపెడుతోంది వంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నిజానికి అక్కడ ప్రజలు కరోనా కంటే లాక్‌డౌన్ అంటేనే హడలిపోతున్నారు. కరోనా తగ్గిందనుకున్న దశలో మళ్లీ విరుచుకుపడటంతో చైనా ప్రభుత్వం మళ్లీ ఆంక్షల కొరడా విధించింది. ఇప్పటికే పలు రెస్టారెంట్లు, కార్యలయాలు మూసివేయడంతో ప్రజలు ఆర్థిక సంక్షోభంతో సతమతమతున్నారు. అంతేగాదు చైనా కూడా కరోనాని కట్టడి చేసే దిశగా ప్రజలకు మూడోరౌండ్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మహిళలు, టీనేజర్ల నుంచి వృద్ధుల దాకా ఎవర్నీ విడిచిపెట్టకుండా బలవంతంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆ ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement