హైదరాబాద్లో మరో భయంకరమైన ఘటన జరిగింది. ఇవ్వాల (మంగళవారం) పాత బస్తీలో ఓ బాలుడిని కుక్క దారుణంగా కరిచేసింది. ఇంటిముందు ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్క ఒక్కసారిగా దాడిచేసింది. వీధి కుక్క దాడితో అయిదేండ్ల బాలుడికి తీవ్రంగా గాయలయ్యాయి. అటువైపు వెళ్తున్న వారు చూసి కుక్కను కర్రలతో తరిమేశారు. దీంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
హైదరాబాద్ సిటీలో ఏ వీధిలో చూసిన కుక్కలు మందలుగా కనిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలు కాలనీల నుంచి సమాచారం అందుతోంది. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యానికి ఇంకా ఎంతమంది పిల్లలు బలికావాల్సి వస్తుందని నగర ప్రజలు భగ్గుమంటున్నారు.