Friday, November 22, 2024

Shame: హైదరాబాద్​లో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై ప్రైవేట్​ స్కూల్​ ప్రిన్సిపల్​ కారు డ్రైవర్​ అఘాయిత్యం

హైదరాబాద్​లోని బంజారాహిల్స్​లో ఓ కీచకుడి అరాచకం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్​ స్కూల్​లో చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఎల్​కేజీ చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిపై స్కూల్​ ప్రిన్సిపల్​ కారు డ్రైవర్​ అఘాయిత్యానికి పాల్పడ్డట్టు ఆ బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. ఇవ్వాల (మంగళవారం) అతడిని పట్టుకుని మహిళలు చితకబాదారు. కాగా, గత రెండు నెలలుగా బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, చాలా కాలంగా బాలిక ప్రవర్తనలో మార్పును గమనించామని తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే.. ఏ విషయంపై తమకేమీ చెప్పడం లేదని, బాలిక ప్రవర్తనలో మార్పును చూసి ఈ విషయాన్ని ఖరారు చేసుకున్నామని తెలిపారు.

కాగా, నిన్నటి నుంచి నీరసంగా ఉండడం, విపరీతంగా ఏడవడంతో అసలు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బంజారాహిల్స్​ పోలీసులకు కంప్లెయింట్​ చేశారు. ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ గా ఉన్న వ్యక్తి డిజిటల్ క్లాస్ రూమ్ లోకి వచ్చి చిన్న పిల్లలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు వారి ఫిర్యాదులో పేర్కొన్నారు. చాలా మంది పిల్లలు డ్రైవర్ రజినీకుమార్ ను చూసి భయపడుతున్నారని, అతని చేష్టల నుంచి పిల్లలను కాపాడాలని వారు కోరాఉ. డ్రైవర్ రజినికుమార్ ను కఠినంగా శిక్షించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement