Tuesday, November 26, 2024

AtmaNirbar Bharath – బొగ్గు నిల్వ‌ల‌పై కేంద్రం దృష్టి…

అమరావతి, ఆంధ్రప్రభ : ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా బొగ్గు మంత్రిత్వ శాఖ దేశంలో ఇంధన భద్రతపై దృష్టి సారించింది. దేశ వ్యాప్తంగా వివిధ గనులు, థర్మల్‌ పవర్‌ ప్లాంట్లు-, రవాణాలో ఉన్న ర్యాక్‌లతో కలిపి జూన్‌ 13 నాటికి బొగ్గు నిల్వలు 44.22 శాతం వృద్ధి చెందాయి. గత ఏడాది ఇదే సమయానికి (జూన్‌ 13 నాటికి) 76.67 మిలియన్‌ టన్నుల మేర ఉన్న బొగ్గు నిల్వలు ఈ ఏడాది ఇదే నాటికి 110.58 మిలియన్‌ టన్నులకు చేరుకున్నాయి. ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యాలకు అనుగుణంగా బొగ్గు మంత్రిత్వ శాఖ దేశ ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకుని బొగ్గు ఉత్పత్తిని పెంపొందించడానికి తీసుకున్న చర్యల ఫలితమే ఈ 44.22 శాతం మేర పెరుగదల అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇదే క్రమంలో విద్యుత్‌ వినియోగదారులు (స్టేక్‌ హోల్డర్స్‌) అందరికీ నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్‌ సరఫరా చేయడానికి కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ చురుకుగా పనిచేస్తోందని తెలిపింది. ఇదికాకుండా అదనంగా, జూన్‌ 13 నాటికి కోల్‌ ఇండియా లిమి-టె-డ్‌ (సీఐఎల్‌) వద్ద పిట్‌ హెడ్‌ కోల్‌ స్టాక్‌ 59.73 మిలియన్‌ టన్నుల మేర ఉంది. ఇది ఏడాది క్రితం 47.49 మిలియన్‌ టన్నులతో పోలిస్తే 25.77 శాతం వృద్ధి రేటు-ను సూచిస్తుంది. ఈ అప్‌వర్డ్‌ -టె-ండ్‌ సమర్థవంతమైన స్టాక్‌ మేనేజ్‌మెంట్‌ వ్యూహాలు మరియు కార్యాచరణ సామర్థ్యాన్ని సూచిస్తుందని కేంద్రం పేర్కొంది.


వచ్చే ఆర్ధిక సంవత్సరంలోనూ ఇదే తరహా
అదే సమయంలో విద్యుత్‌ రంగానికి బొగ్గు పంపిణీ పరంగా, వచ్చే ఆర్ధిక సంత్సరం జూన్‌ 13 నాటికి విజయవంతంగా 164.84 మిలియన్‌ టన్నులకు చేరుకోనుంది. ఇది 2023 ఆర్ధిక సంవత్సరం కన్నా 5.11 శాతం వృద్ధి రేటు-ను సాధించినట్లవుతుంది. విద్యుత్‌ రంగం యొక్క ఇంధన అవసరాలను తీర్చడానికి స్థిరమైన బొగ్గు సరఫరాను ఈ గణనీయమైన పెరుగదల నిర్ధారిస్తుందని వెల్లడించింది. దేశీయ బొగ్గు ఆధారిత (డీసీబీ) థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో 2022 ఏప్రిల్‌ 1 నాటికి బొగ్గు నిల్వ 24.04 మిలియన్‌ టన్నుల మేర ఉండగా అది జూన్‌ 13 నాటికి 22.57 మిలియన్‌ టన్నులకు చేరుకుంది. అయినప్పటికీ, ఈనిల్వలు ఏప్రిల్‌ 1, 2023 నాటికి 34.5 మిలియన్‌ టన్నుల మేరకు చేరుకోగా 2023, జూన్‌ 13 నాటికి అదే మోతాదు నమోదవుతూ వస్తోంది. దీనినిబట్టి చూస్తే వేసవి చివరి రెండున్నర నెలల్లో బొగ్గు నిల్వలు తగ్గలేదని స్పష్టంగా అర్ధమౌతోంది. వేసవి కాలంలో బొగ్గు ఉత్పత్తి మరియు పంపిణీలో అధిక వృద్ధి రేటు-ను సాధించడం ద్వారా ఇది సాధ్యమైంది.

గణనీయమైన వృద్ధి
మొత్తంమీద, 2024 ఆర్ధిక సంవత్సరం కోసం సంచిత బొగ్గు ఉత్పత్తి అసాధారణమైన వృద్ధిని సాధించింది. జూన్‌ 13, 2023 నాటికి 182.06 మిలియన్‌ టన్నుల ఉత్పత్తితో, గత సంవత్సరం ఉత్పత్తి 168.17 మిలియన్‌ టన్నులతో పోలిస్తే 8.26 శాతం గణనీయమైన వృద్ధి రేటు-ను సాధించింది. అంతేకాకుండా జూన్‌ 13న 196.87 మిలియన్‌ టన్నులకు చేరిన మొత్తం బొగ్గు పంపిణీ గణనీయమైన పెరుగుదలను సాధించింది. ఇది గత సంవత్సరం పంపిన 182.78 మిలియన్‌ టన్నులతో పోలిస్తే 7.71 శాతం వృద్ధి రేటు-ను సూచిస్తుంది. బొగ్గు మంత్రిత్వ శాఖ వ్యూహాత్మక ప్రణాళిక మరియు సమర్థవంతమైన అమలు ద్వారా బొగ్గు రంగంలో స్థిరమైన వృద్ధిని సాధించడానికి మరియు పెరుగుతున్న ఇంధన డిమాండ్లను తీర్చడంలో విద్యుత్‌ రంగాలకు మద్దతునిస్తూ దేశీయ బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాలను పెంపొందించడానికి పూర్తిగా కట్టు-బడి ఉందని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement