Saturday, November 23, 2024

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్: జనవరి 1 నుంచి కొత్త రూల్స్

బ్యాంకు కస్టమర్లకు అలర్ట్​. కొత్త సంవత్సరం నుంచి బ్యాంకింగ్ రూల్స్​లో మార్పులు రానున్నాయి. 2022 జనవరి 1వ తేదీ నుంచి ఏటీఎం విత్​డ్రా ఛార్జీల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. బ్యాంకింగ్ వినియోగదారులకు ప్రస్తుతం ఏటీఎం ఛార్జీలు పరిమితి దాటిన తర్వాత.. ప్రతి లావాదేవీకి రూ.20 ఛార్జీగా వసూలు చేస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ ఛార్జీలు రూ.21కి పెరగనున్నాయి. దీనికి జీఎస్​టీ అదనం. ఏటీఎం ఛార్జీలు పెంచేందుకు ఆర్​బీఐ ఇప్పటికే అనుమతులు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు బ్యాంకులు తమ ఖాతాదారులకు కొత్త ఛార్జీల గురించి సమాచారం ఇస్తున్నాయి.

ఏదైన బ్యాంక్​ వినియోగదారుడు.. అదే బ్యాంక్ ఏటీఎంలో 5 సార్లు ఉచితంగా లావాదేవీలు జరపొచ్చు. ఇతర బ్యాంకు ఏటీఎంలలో మెట్రో నగరాల్లో అయితే మూడు సార్లు, నాన్​ మెట్రో పట్టణాల్లో 5 సార్లు పరిమితి ఉంది. అయితే, ఈ పరిమితి దాటి తర్వాత చేసే ప్రతి లావాదేవీకి రూ.21 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. దీనికి జీఎస్​టీ అదనం. జనవరి 1 నుంచి దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఈ కొత్త నిబంధనలను అమలు చేయనున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement