ఫిలిప్ఫిన్స్‌ను భారీ వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. ‘రాయ్’ తుఫాన్ దాటికి 75 మంది ప్రాణాలు కోల్పోయారు. 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బలంగా గాలులు వీయడంతో.. విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. ఇళ్ల పై కప్పులు కొట్టుకుపోయాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బోహోల్ దీవిపై రాయ్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. బోహోల్ ద్వీపంలో తుఫాన్ కారణంగా 49 మంది చనిపోయారని గవర్నర్ ఆర్థర్ యప్ చెప్పారు. మరో పది మంది జాడ తెలియడం లేదని, 13 మందికి తీవ్ర గాయాలు అయినట్లు వెల్లడించారు.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. ఫిలిప్ఫిన్స్ నేవీ నౌకలో బోహోల్‌కు నిత్యావసరాలు, పునరావాస సామాగ్రిని తరలిస్తున్నట్లు ఆ ప్రావిన్స్ గవర్నర్ యప్ తెలిపారు. క్రిస్మస్ సెలవుల కోసం వచ్చిన పర్యాటకులు.. తుఫాన్ దెబ్బకు ఇబ్బందులు పడుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..