ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో విషాద ఘటన చోటు చేసుకుంది. బామ్ బ్లోరా గ్రామంలోని బంగారు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 59 మంది మరణించగా.. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బంగారాన్ని శుద్ధిచేసే రసాయనాల వల్లే పేలుడు సంభవించినట్లు భావిస్తున్నారు. పేలుడు సంభవించిన వెంటనే మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. తొలి పేలుడు రాత్రి 2 గంటల సమయంలో జరిగిందని ఓ అధికారి తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement