Saturday, November 23, 2024

నదిలో రెండు పడవలు ఢీ.. 26 మంది జలసమాధి!

బంగ్లాదేశ్‌లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. పద్మ నదిలో వేగంగా వెళుతున్న ఓ బోటు తిరగబడింది. ఈ ఘటనలో 26 మంది మృతి చెందారు. మరో అయిదుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన సోమవారం ఉదయం మదారిపూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. యాణికులతో వెళ్తోన్న పడవను ఇసుక తీసుకెళ్లే బోటు ఒకదానికొకటి ఢీకొట్టాయి. దీంతో అందులోని 26 మంది నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. నదిలో మునిగిపోయిన వారి కోసం గాలింపు చేపట్టారు. నిర్వహణ సరిగా లేకపోవడం, సామర్థ్యానికి మించి పడవలో ఎక్కడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని బంగ్లాదేశ్ పోలీసులు పేర్కొన్నారు.

కోవిడ్‌ ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ, వాటిని పాటించకుండా ఒకే పడవలో 30 మందిని ఎక్కించారని ప్రమాదం తెలిపారు. మొత్తం 26 మృతదేహాలను నీటి నుంచి వెలికి తీశారు. మృతుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించేందుకు ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.

కాగా, బంగ్లాదేశ్‌లో తరుచూ ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత నెలలో నారాయణగంజ వద్ద 50 మందితో వెళ్తోన్న ఓ పడవ బోల్తాపడిన ఘటనలో 30 మంది మరణించారు. గత ఏడాది జూన్‌లోనూ ఢాకా సమీపంలో జరిగిన పడవ ప్రమాదంలో 32 మంది జలసమాధి అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement