Tuesday, November 19, 2024

కేరళలో వరదల బీభత్సం.. 24 మంది మృతి

కేర‌ళను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గ‌త రెండు రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాలతో వ‌ర‌ద‌లు ముంచెత్తున్నాయి. వ‌ర్షాల ధాటికి వాగులు, వంక‌లు, న‌దులు ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తున్నాయి. తిరువనంత‌పురం, కొట్టాయం, ప‌థనం మిట్ట‌, ఇడుక్కి జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. వ‌ర్షాల కార‌ణంగా కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డుతున్నాయి. వర్షాల ధాటికి 24 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. పలువురు గల్లంతయ్యారు. కొట్టాయంలో వరదలతో ఇల్లు కొట్టుకుపోయాయి. పలు గ్రామాలు నీట మునిగాయి. ఎన్డీఆర్ఎఫ్‌, ఎస్టీఆర్ఎఫ్‌, త్రివిధ ద‌ళాల సైన్యం స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మైంది. కొట్టాయంలో సహాయకచర్యలు చేప్పట్టిన ఆర్మీ అధికారులు, హెలికాప్టర్ సహాయం తో వరద బాధితులకు ఆహారాన్ని అందజేశారు.

మరోవైపు రాష్ట్రంలో ఉన్న తాజా పరిస్థితిపై ప్రధాని మోదీ ఆరా తీశారు. కేరళ సీఎం పినరయి విజయన్ తో మాట్లాడిన ప్రధాని.. కేంద్రం నుంచి అన్ని ర‌కాల స‌హాయ స‌హకారాలు అందిస్తామ‌ని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: వైసీపీ ఎన్డీయేలో చేరాలి: కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్య

Advertisement

తాజా వార్తలు

Advertisement