Friday, November 22, 2024

Gun Fire: అమెరికా మళ్లీ కాల్పుల మోత.. 10 మంది మృతి

అమెరికా మరోసారి కాల్పుల మోత కలకలం సృష్టించాయి. న్యూయార్క్‌లోని  ఓ సూపర్‌ మార్కెట్‌లో దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో పది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం మధ్యాహ్నం సైనికుడి దుస్తుల్లో ఉన్న 18 ఏళ్ల ఓ యువకుడు టాప్స్‌ ఫ్రెండ్లీ సూపర్‌మార్కెట్‌లోకి ప్రవేశించాడు. అందులో ఉన్న వారిపై ఒక్కసారిగా తుపాకీతో కాల్పులు ప్రారంభించాడు. దీంతో పదిమంది దుర్మరణం చెందారని అధికారులు తెలిపారు. కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విచారం వ్యక్తంచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement