రష్యా దాడితో ఉక్రెయిన్ ని వదిలి పారిపోతున్నారు అక్కడి జనం. ఉక్రెయిన్ వలసలకు సాయం అందించడంలో ముందుంటామన్న బ్రిటన్ ప్రభుత్వం.. ఆ పని చేయడం లేదని విమర్శలు వచ్చాయి. ఉక్రెయిన్ నుంచి వస్తున్న వలసల వీసా వంటి పత్రాల కోసం ఎదురు చూస్తున్నారని, ఇలాంటి నిబంధనలు సాయం చేయడానికి అడ్డుగా ఉంటాయని బ్రిటన్ నేతలు కూడా విమర్శలు చేశారు. ఈ క్రమంలో తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ఉక్రేనియన్లు.. తమ బంధువులు ఉన్న ప్రాంతాలకు పారిపోయారు. ఇప్పుడు అలాంటి పని చేయాల్సిన అవసరం లేదని, బ్రిటన్‌కు రావాలని ఆయన పిలిచారు. అంతేకాదు, ఉక్రెయిన్ నుంచి వస్తున్న వారికి ఎవరైనా తమ ఇంట్లో ఆవాసం కల్పిస్తే.. ఆ కుటుంబానికి నెలకు 350 పౌండ్లు అంటే 456 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.35 వేలు) చెల్లిస్తామని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. ఇంట్లో ఒక గదిలో అయినా సరే ఉక్రేనియన్లకు కనీసం ఆరు నెలలపాటు ఆవాసం కల్పించడానికి అంగీకరిస్తే ‘‘హోమ్స్ ఫర్ ఉక్రెయిన్’’ పథకం కింద ఈ డబ్బు చెల్లిస్తామని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..