ప్రపంచంలో కంప్యూటరే రారాజు. డెస్క్‌టాప్ పీసీలకు పోటీగా ఆల్-ఇన్-వన్ పీసీలు అందుబాటులోకి వచ్చేసాయి. ఈ పీసీలు స్లిమ్ తత్వాన్నికలిగి కేవలం కొద్ది స్థలాన్నిమాత్రమే ఆక్రమిస్తాయి. వైర్లు అక్కర్లేదు. కీబోర్డ్ ఇంకా మౌస్‌లు బ్లూటూత్ సాయంతో స్పందిస్తాయి. కంప్యూటింగ్ ప్రపంచలోకి ఇటీవల కాలంలో అడుగుపెట్టిన ఆల్ ఇన్ వన్ కంప్యూటర్ లు కస్టమర్ దేవుళ్లకు సైతం హాట్ ఫేవరేట్‌గా నిలుస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ వరుసగా నూతన ఫీచర్లతో ల్యాప్‌టాప్, పీసీలను విడుదల చేస్తున్నాయి. తాజాగా షియోమి, హానర్ వంటి ఎలక్ట్రానిక్ బ్రాండ్లు గట్టి పోటీనిచ్చేందుకు ప్రముఖ ఎలక్ట్రానిక్ బ్రాండ్ ఏసుస్ సిద్ధమైంది. సరికొత్త ఆల్ ఇన్ వన్ పర్సనల్ కంప్యూటర్(పీసీ)ని భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. AiO V241 పేరుతో విడుదలైన ఈ పీసీని స్పెషల్ డిజైన్‌తో ఆకర్షణీయంగా రూపొందించింది. వీటిలో అద్భుతమైన ఫీచర్లను చేర్చింది.
AiO V241 పీసీ 23.8 -అంగుళాల నానో ఎడ్జ్ IPS డిస్ప్లేతో 88 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో వస్తుంది. దీనిలో 100 శాతం ఎస్‌ఆర్‌జిబి కలర్ గ్యామ్యూట్ని అందించింది. ఇది 11వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ 7 ప్రాసెసర్, ఇంటెల్ ఐరిస్ ఎక్స్ గ్రాఫిక్, 8 జిబి ఓడిడిఆర్ 4 ర్యామ్‌తో పనిచేస్తుంది. ఈ పీసీ డ్యుయల్ స్టోరేజికి మద్దతిస్తుంది. దీని హార్డ్ డిస్క్‌ను 1 TB HDD వరకు, స్టోరేజీ కెపాసిటీని 512 GB SSD వరకు పెంచుకోవచ్చు. వీటితో పాటు అదనంగా 3W స్టీరియో స్పీకర్లను కూడా అందించింది. ఈ పీసీ 90W పవర్ అవుట్‌పుట్, విండోస్ 10 హోమ్‌తో పనిచేస్తుంది. మెరుగైన వినియోగం కోసం దీనిలో వైర్‌లెస్ కీబోర్డ్, మౌస్ సపోర్ట్‌ను కూడా అందించింది.
ఏసుస్ నుంచి కొత్త పీసీ.. ఫీచర్లు తెలుసా?
Advertisement
తాజా వార్తలు
Advertisement