సోషల్ మీడియాలో ఎప్పుడు ఎట్లా జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది. చేతిలో ఫోన్, అందులో సోషల్ మీడాయా యాప్స్ ఉంటే చాలు.. పొద్దు తెలియకుండానే పోతుంది.. అనేది నిజం చేస్తున్నారు కొంతమంది. ఇక.. ఇవ్వాల (మంగళవారం) పాక్షిక సూర్యగ్రహణం వేల కొంతమంది ఆలోచనలతో కూడిన పోస్టులు పెడుతుంటే.. ఇంకొంతమంది ఫన్నీగా ఉండే ఫొటోలను పోస్టు చేస్తూ అందరినీ నవ్విస్తున్నారు.
అయితే ఇప్పుడు ఒక ఫొటో ట్విట్టర్లో భలే ట్రెండ్ అవుతోంది. డైరెక్టుగా సూర్య గ్రహణాన్ని చూడొద్దని శాస్త్రవేత్తలు, డాక్టర్లు చెప్పినట్టు ఓ వ్యక్తి బీరు సీసాలోనుంచి సూర్యగ్రహణాన్ని చూస్తున్నాడు. దీన్ని ఫొటో తీసిన మరో వ్యక్తి ట్వీట్టర్లో పోస్టు చేసి ‘‘సూర్యగ్రహణాన్ని వీక్షిస్తున్న ఖగోళ శాస్త్రవేత్త”అని కామెంట్ పెట్టాడు. మీరూ చూసి కాసేపు నవ్వుకోండి..