Sunday, November 24, 2024

ఆస్ట్రాజెనెకా టీకా ఒక్క డోసుతోనే 80 శాతం ముప్పు తప్పినట్లేనటా..

ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనెకా టీకా పనితీరు బాగుందని ఇంగ్లాండ్ ప్రజారోగ్య శాఖ వెల్లడించింది. ఈ టీకా ఒక్క డోసు వేసుకున్నా కరోనా మరణాల ముప్పు 80 శాతం తగ్గుతోందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రాజెనికా వినియోగం, దాని వల్ల కలుగుతున్న ప్రభావాలను అంచనా వేసి ఈ నిర్ధారణకు వచ్చామని పేర్కొంది. ఇటు ఫైజర్, బయోఎన్ టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేసుకుంటే మరణాల ముప్పు 80 శాతం తగ్గుతోందని, రెండు డోసులూ వేసుకుంటే కనుక 97 శాతం తగ్గిస్తోందని పేర్కొంది. డిసెంబర్ నుంచి ఏప్రిల్ మధ్య నమోదైన లక్షణాలున్న కేసులు, పాజిటివ్ అని తేలిన 28 రోజులకు చనిపోయిన వారి వివరాలను అధ్యయనం చేసినట్టు పీహెచ్ఈ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement