భూమి వైపు ఒక భారీ గ్రహ శకలం దూసుకొస్తున్నదని నాసా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది ఎంతో వేగంగా భూమివైపునకు వస్తున్నదని తెలిపారు. భూమిపై పడితే ఎంతో ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఇది భూమిని దాటేస్తుందని, ఇలా గ్రహ శకలాలు భూమివైపు రావడం కొత్తేమీ కాదన్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. అయితే వీటితో ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. తాజాగా అంతరిక్షం నుంచి భూమికి ఈ శకలం దూసుకొస్తున్నది. గంటకు 49,513 కిమీ వేగంతో వస్తున్నదన్నారు. 450 మీటర్ల వెడల్పుతో ఉన్న ఈ గ్రహ శకలం.. మిగిలిన వాటితో పోలిస్తే.. చిన్నదే అన్నారు.
కానీ ఇది ప్రయాణించే వేగం ప్రమాదకరంగా ఉందన్నారు. భూమిపై పడితే చాలా నష్టం వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు. తాజాగా పొటెన్షియల్లిd హజార్డస్ గ్రహ శకలాల జాబితాలో నాసా చేర్చింది. ఆస్టరాయిడ్ 2013 బీవో 76 అని పిలిచే ఇది ఈసారి భూమికి 51,11,759 కి.మీ దూరం నుంచి దూసుకుపోతున్నది. భూమిపై ఎటువంటి ప్రభావం చూపబోదంటున్నారు. 2033, జులై 14న మళ్లిd ఇదే గ్రహ శకలం భూమికి దగ్గరగా వస్తుందని చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..