Tuesday, November 26, 2024

14 ఏళ్ల బాలికపై మరుతండ్రి దురాఘతం.. రేప్​ కేసులో 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష

ఓ 14 ఏళ్ల అమ్మాయిపై మరుతండ్రి దారుణానికి పాల్పడ్డాడు. పలుమార్లు అత్యాచారం చేశాడు. పైగా ఈ విషయం తల్లికి చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆ బాలిక తన దోస్తులకు తన మరుతండ్రి చేసే దురాఘతాన్ని తెలియజేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు పెట్టగా.. విచారణలో భాగంగా కోర్టు ఆ మృగాడికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు మరో ఏడాదిపాటు సాధారణ జైలు శిక్ష విధించింది.

అస్సాంకు చెందిన 35 ఏళ్ల వ్యక్తి తన 14 ఏళ్ల స్టెప్​ డాటర్​పై పదేపదే అత్యాచారం చేసినందుకు అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ కమెంగ్ జిల్లాలోని పోక్సో కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అస్సాంలోని బిస్వనాథ్ జిల్లాకు చెందిన భవానీ చెత్రీకి పశ్చిమ కమెంగ్ పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి తగెంగ్ పాడోహ్ ఈ శిక్షతో పాటు రూ. 5,000 జరిమానా కూడా విధించారు. ఐపీసీ 506 కింద చెట్రీకి ఇంకో సంవత్సరం పాటు సాధారణ జైలు శిక్ష, అదనంగా రూ. 2,000 జరిమానా వేశారు. అయితే. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో ఆరు నెలలపాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పు నిచ్చారు.

తక్సాంగ్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థి అయిన బాలికి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మరు తండ్రి అయిన చెత్రీ కెలెంగ్‌టెంగ్ గ్రామంలో ,  తవాంగ్ జిల్లాలోని సంగీత్‌సర్ సరస్సు సమీపంలో మరో.. మూడు వేర్వేరు ప్రదేశాల్లో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 2020 మార్చి, 2021 ఏప్రిల్ మధ్య బాలికపై మూడుసార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని తల్లికి చెబితే చంపేస్తానని బెదిరించాడు. అయితే.. అతని బారినుంచి ప్రాణాలతో బయటపడిన ఆమె తన స్నేహితులకు ఈ విషయాన్ని చెప్పింది. వారు రెసిడెన్షియల్ స్కూల్​ అధికారులకు తెలియజేయడంతో ఈ విషయం కాస్త తల్లికి తెలిసింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు గతేడాది ఏప్రిల్‌లో నిందితుడిని అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement