అస్సోం సీఎం హేమంత బిశ్వ శర్మపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు గీతారెడ్డి, రేణుకా చౌదరి కలిసి మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీపై తీవ్రవ్యాఖ్యలు చేశారు హేమంత బిశ్వ శర్మ. సీఎం పీఠంపై కూర్చున్న మూర్ఖుడు హేమంత అని వారు తెలిపారు. రాహుల్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. సర్జికల్ స్ట్రయిక్స్ కు ఆధారాలు చూపాలని అడిగితే… తండ్రి ఎవరనే ఆధారాల గురించి ఎవరైనా మాట్లాడుతారా అని మండిపడ్డారు. హేమంత నీచమైన మాటలు మాట్లాడినా.. రాహుల్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని తెలిపారు. బీజేపీ నేతలకు మహిళలంటే గౌరవం లేదని మండిపడ్డారు. హేమంతపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు. అయితే రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఈ అంశం తన పరిధిలోకి రాదని, దీన్ని కేంద్ర కమిషన్ కు పంపిస్తానని చెప్పారని వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..